డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలి
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్, రాజీవ్ నగర్ కాలనీలో గల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, డిప్యూటీ తహసీల్దార్ సురేందర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ మాట్లాడుతూ... రుద్రూర్ మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి, నిరుపేదలకు పంపిణీ చేయకుండా చేసిందన్నారు. బాన్సువాడ...