Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 7:34 pm Posted by : ramakrishna

పేద ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంచాలి

 

. . . సీపీఐఎం జిల్లా కార్యదర్శి అడివాలా రమేష్ బాబు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రిపేర్ చేసి వెంటనే నిరుపేదలకు అందించాలని సీపీఐఎం జిల్లా కార్యదర్శి అడివాలా రమేష్ బాబు అన్నారు. ఈ విషయమై సోమవారం సిపీఐఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు, నగర కార్యదర్శి బెజ్గం సుజాత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈనెల 25న డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంచి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ఇప్పటికి పూర్తి చేయలేదన్నారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ అనుచరులకు, డబ్బులు ఇచ్చే వారికి ఇండ్లు కట్టబెడదామని చూశారన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి వదిలేయడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, గంజాయి, డ్రగ్స్, మద్యం సేవిస్తూ వచ్చే పోయే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని గతంలో చాలా సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, కానీ ఎలాంటి మార్పులు జరగలేదని వాపోయారు. కనీసం ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా డబల్ బెడ్ రూమ్ ఇండ్లను మరమ్మత్తులు చేసి ప్రజలకు అందే విధంగా చూడాలని, లేదంటే రేపు రానున్న రోజుల్లో సిపిఐఎం ఆధ్వర్యంలో ప్రజలందరిని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యులు నల్వాల నరసయ్య, నాయకులు ఎస్.కె.రజియా, కె.శ్రీదేవి, అంజయ్య, సతీష్, అనిత, సునీత తదితరులు పాల్గొన్నారు.

 

Double bedroom houses should be distributed to poor people.