జుక్కల్, బతుకమ్మ: జుక్కల్ మండలానికి చెందిన పలువురికి డబుల్ బెడ్ రూం ఇళ్ల, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాటాలడుతూ.. ఏడాది కాలంలో 1.66లక్షల కుటుంబాలకు రూ.830 కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు. అలాగే 13వేల మందికి రూ.240 కోట్ల విలువైన ఎల్ వో సీలు అందించామని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. అనంతరం మిషన్ కల్లాలి గ్రామంలో నూతనంగా మంజూరైన చౌకధరల దుకాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ హిమబిందు, కేమ్రాజ్ కల్లాలి మాజీ సర్పంచ్ రమేశ్ దేశాయ్, మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిగౌడ్, మాజీ ఎంపీటీసీ ఇమ్రాన్ ఖాన్, బాబురావు పటేల్, జుక్కల్ సొసైటీ చైర్మన్ పటేల్, జుక్కల్ సొసైటీ మాజీ చైర్మన్ రాజు పటేల్, అనిల్ సేట్, ఖండే బల్లూర్ కృష్ణ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
