Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 April 2025, 9:27 pm Posted by : ramakrishna

అంధకారంలో డబుల్ బెడ్ రూమ్ కాలనీ

  • పట్టించుకోని గ్రామపంచాయతీ అధికారులు

 

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీలో గల  డబుల్ బెడ్ రూమ్ కాలనీలో కొన్ని విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు వెలగకపోవడంతో కాలనీ అంధకారంగా మారింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పక్కనే పంట పొలాలు ఉన్నాయి. రాత్రి వేళల్లో పంట పొలాల నుండి విషసర్పాలు వస్తున్నాయని, దీంతో కాలనీ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. విద్యుత్ బల్బులు ఏర్పాటు చేయాలని పలుమార్లు గ్రామపంచాయతీ అధికారులకు విన్నవించిన పట్టించుకోకుండా నిమ్మకునీరేత్తినట్లుగా  వ్యవహరిస్తున్నారని కాలనీ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ బల్బులు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.