Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 8:07 pm Posted by : ramakrishna

జిల్లావ్యాప్తంగా ఇంటింటికి పోలియో చుక్కలు

 

భిక్కనూర్, బతుకమ్మ :

 

పోలియో మహమ్మారి దేశం నుంచి పూర్తిగ తరిమికొట్టేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని  ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఈ కార్యక్రమాన్ని భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలో టీకాల కార్యక్రమాన్ని అన్ని గ్రామాల సర్పంచులు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ జివి రమణ, జిల్లా వైద్యా ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకటి, పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

 

Door-to-door polio drops across the district