ఆందోళన వద్దు.. అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్
హైదరాబాద్, బతుకమ్మ : ఇంటర్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు మానసికంగా కుంగుబాటుకు లోనయ్యే అవకాశం ఉంది. ఫలితాల విడుదల తర్వాత ఒత్తిడికి గురయ్యే విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు టోల్ ఫ్రీ నంబర్ 18008914416 ను అందుబాటులోకి తెచ్చింది. వెంటనే ఈనంబర్ కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని పేర్కొంది. మేలో సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్ పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించామని బోర్డు కార్యదర్శి కష్ణ ఆదిత్య తెలిపారు. 19 కేంద్రాల్లో పేపర్ల వాల్యూయేషన్ చేపట్టామన్నారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్...