విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ వాడొద్దు

రుద్రూర్, బతుకమ్మ : యాంటీబయోటిక్స్ మందులను విచ్చల విడిగా వాడొద్దని హెల్త్ సూపర్ వైజర్ రవి కుమార్ సూచించారు. ప్రపంచ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వారోత్సవాల్లో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని ఫుడ్ సైన్స్  టెక్నాలజీ కళాశాలలో వైద్యాధి కారిణి ఆయేషా సిద్దిఖా ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు యాంటీ బయోటిక్ మందులపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాంటీబయోటిక్స్ మందులను విచ్చలవిడిగా తీసుకోవడం వలన ఆ వ్యాధికారక సూక్ష్మజీవులకు, ఆ బయోటిక్స్ మందులకు వ్యతిరేకంగా నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. వ్యాధి తీవ్రత పెరిగి,...