Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 5:56 pm Posted by : ramakrishna

విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ వాడొద్దు

రుద్రూర్, బతుకమ్మ : యాంటీబయోటిక్స్ మందులను విచ్చల విడిగా వాడొద్దని హెల్త్ సూపర్ వైజర్ రవి కుమార్ సూచించారు. ప్రపంచ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వారోత్సవాల్లో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని ఫుడ్ సైన్స్  టెక్నాలజీ కళాశాలలో వైద్యాధి కారిణి ఆయేషా సిద్దిఖా ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు యాంటీ బయోటిక్ మందులపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాంటీబయోటిక్స్ మందులను విచ్చలవిడిగా తీసుకోవడం వలన ఆ వ్యాధికారక సూక్ష్మజీవులకు, ఆ బయోటిక్స్ మందులకు వ్యతిరేకంగా నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. వ్యాధి తీవ్రత పెరిగి, తీవ్ర అస్వస్థకు గురి చేయడమే కాక మరణానికి దారి తీస్తుందని, కావున విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ మందులను వాడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ వేంకట్ రెడ్డి, ఆరోగ్య విస్తీరణ అధికారి శ్రీనివాస్, ఆరోగ్య కార్యకర్తలు,  అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు.