Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2025, 2:37 pm Posted by : ramakrishna

దళారులను నమ్మి మోసపోవద్దు : డీసీఓ శ్రీనివాస్

మాక్లూర్, బతుకమ్మ :మాక్లుర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కొనుగోలు కేంద్రాన్ని  డీసీఒ శ్రీనివాస్ బుదవారం ప్రారంభించారు. అనంతరం ప్రాథమిక సహకార సంఘ చైర్మన్ భూరోల్ల అశోక్ డిసిఓ శ్రీనివాస్ ను శాలువాతో సత్కరించారు. డిసిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు దళారులను మోసపోవద్దని రైతులు కల్లాల వద్దకే తమ ధాన్యాన్ని ఎండబోయాలని సూచించారు. రైతుల కల్లాల వద్దని ధాన్యం కొనుగోలు నిర్వహించబడుతుందని తెలిపారు.రైతులు తెచ్చిన వారి ధాన్యాన్ని వెనువెంటనే తూకం చేయాలన్నారు,వరి ధాన్యం గ్రేడ్ ఏ కు 2389 రూపాయలు,,కామన్ వరి ధాన్యానికి 2369, రూపాయలు,ప్రభుత్వం  చెల్లిస్తుందని రైతులకు తెలిపారు,రైతులు దళారులను నమ్ముకొని  ధాన్యాన్ని అమ్ముకోవద్దని సూచించారు.కొనుగోలు కేంద్రానికి వచ్చిన వరి ధాన్యాన్ని వెను వెంటనే మ్యాచర్ ద్వారా చూసి తొందరగా మార్కెట్ యార్డుకు లారీలలో తరలించేటట్లు చూడాలని సిబ్బందికి సూచించారు. లారీల కొరత ఉన్నట్లయితే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు, వరి ధాన్యాన్ని తరలించే క్రమంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే ప్రాథమిక సహకార సంఘ చైర్మన్ భూరోల్ల అశోక్ మరియు సిబ్బంది దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా బాధ్యత వహించాలని తెలిపారు, అనంతరం ప్రాథమిక సహకార సంఘ చైర్మన్ భూరోల్ల అశోక్ చిక్లి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులకు పాలు రకాల సూచనలు జారీ చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సిబ్బందికి తెలిపారు.ఈ కార్యక్రమంలో మాక్లుర్ పిఎసిఎస్ చైర్మన్ భూరోల్ల అశోక్, స్పెషల్ ఆఫీసర్ స్వప్న,వెంకటేశ్వరరావు ఎక్స్ సర్పంచ్ రాజు,కృష్ణారావు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Don't trust middlemen and get fooled: DCO Srinivas