విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు

ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి వామపక్ష విద్యార్థి సంఘాల ర్యాలీలో ప్రభుత్వానికి హెచ్చరిక   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్‌లో పెద్ద ఎత్తున విద్యార్థి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు సాగింది. ఈ సందర్భంగా ఏఐపీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు బోడ...