Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 March 2025, 4:09 pm Posted by : ramakrishna

మూత్ర పిండాలను నిర్లక్ష్యం చేయొద్దు

  • డాక్టర్ అజయ్ కుమార్ విశ్వంత్ పాటిల్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇటీవల కాలంలో ఎక్కువగా దీర్ఘకాలిక మూత్రపిండా వ్యాధి భారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారని ప్రముఖ మూత్రపిండాల వైద్య నిపుణులు డాక్టర్ అజయ్ కుమార్ విశ్వంత్ పాటిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా మూత్ర పిండానికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు తలెత్తిన నిర్లక్ష్యం వహించకుండా సంబంధిత వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాదు రోడ్డు ఎల్లమ్మ గుట్టలో గల మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రపంచ మూత్రపిండాల దినోత్సవాన్ని పురస్కరించుకొని మూత్రపిండ వ్యాధి బారిన పడ్డవారికి, రోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ మూత్రపిండాల వైద్య నిపుణులు డాక్టర్ అజయ్ కుమార్ విశ్వంత్ పాటిల్ మాట్లాడుతూ నిత్యం రోజురోజుకు తీసుకునే ఆహారపు అలవాట్లు మధుమేహం, రక్తపోటు, అధికంగా పెయిన్ కిల్లర్ మందులు వాడడం, సరైన ఆహారం అలాగే నీటి శాతం తక్కువ తీసుకోవడం డిహైడ్రేషన్, ఇతర అనారోగ్య సమస్యలకు అధికంగా ఇస్టారీతిన వైద్యుల సలహాలు లేకుండా మందులు వాడడం వల్ల మూత్రపిండాల వ్యాధి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూత్రపిండాల వ్యాధి నా బారిన పడి డయాలసిస్ అనేది నిరంతరంగా చేయించుకోవడం జరుగుతుందన్నారు. కొన్ని సందర్భాల్లో ఎక్కువమంది మూత్రపిండాల వల్ల నిర్లక్ష్యం

Don't neglect your kidneys.

వహించడం ద్వారా ప్రాణాలు సైతం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక వ్యాధి మూత్రపిండా నిశ్శబ్దముప్పుగా పేరు  గాంచిదన్నారు. మూత్రపిండాల జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యం వహించరాదని ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం మెడికవర్ హాస్పిటల్స్  అసిస్టెంట్ మెడికల్ సూపరిండెంట్  డాక్టర్ కూరపాటి యజ్ఞ, డైటీషియన్ మెడికవర్ హాస్పిటల్స్  శ్రీలేఖ లు మాట్లాడుతూ శరీరంలో ప్రతి అవయవం కూడా చాలా ముఖ్యమైందని గుర్తు చేశారు. అయితే నేడు ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం సందర్భంగా ఈ మూత్రపిండాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే సదుద్దేశంతో  మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మూత్రపిండాలకు సంబంధించిన సమస్య అలాగే మూత్రపిండాల సమస్య వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అది మనకు మనము మన చేతుల ద్వారా మనమే ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎప్పుడైతే సరైన ఆహారపు అలవాట్లు, యోగ, నడక, ఎక్ససైజ్, అలాగే ఎండలు ఉన్న లేనప్పటికీ కూడా నిత్యం నీటి శాతం ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఎప్పుడైతే నీటి శాతం తగ్గుతుందో శరీరంలో చాలా రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు. దాంతోపాటు ముఖ్యంగా శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ కి శరీరం గురవుతుందన్నారు.. దీని ప్రభావం మూత్రపిండాల మీద పడుతుందన్నారు.. ఈ మూత్ర పిండాల విషయంలో చిన్న చిన్నగా మూత్రం సరిగ్గా రాకపోవడం, కిడ్నీలో రాళ్లు లాంటివి రావడం అలాగే కొన్ని రకాల ఫంగస్ ఇన్ఫెక్షన్లు, కొన్నిచోట్ల తీవ్రమైన నొప్పి రావడం అనేది కూడా వస్తూ ఉంటాయి. వీటిని నిర్లక్ష్యం వహించకుండా సరైన సమయంలో వైద్యుల్ని సంప్రదించినట్లయితే వైద్యుల సలహాలతో వారు చెప్పిన విధంగా ఆహారపు అలవాట్లు, మందుల వాడడం ద్వారా ఈ మూత్రపిండాల వ్యాధి బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం జరుగుతుందని తెలిపారు.. ఈ అవగాహన సదస్సులో మూత్రపిండాల వ్యాధి బారిన పడిన వారిలో డయాలసిస్ తో బాధపడుతున్న వారికి మనోధైర్యం కల్పించారు. అనంతరం ప్రపంచ మూత్రపిండాల వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని మెడికవర్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు సిబ్బంది మరియు వ్యాధిగ్రస్తులతో  కేక్ కట్ చేయించారు.. ఈ కార్యక్రమంలో  మెడికవర్ హాస్పిటల్స్ అసిస్టెంట్ సూపరిండెంట్ డాక్టర్ యజ్ఞ, యూరాలజిస్ట్ డాక్టర్ ఏ సతీష్, మెడికవర్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ స్వామి, మార్కెటింగ్ మేనేజర్ వినయ్ కుమార్, మెడికవర్ హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Don't neglect your kidneys.