Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2025, 6:28 pm Posted by : ramakrishna

డౌన్ సిండ్రోమ్ పిల్లల పట్ల చిన్న చూపు చూడొద్దు

  • జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  డౌన్ సిండ్రోమ్ పిల్లలు పుట్టడానికి నివారణ చర్యలు లేవని గర్భ విచ్చిత్తి మాత్రమే మార్గమని,డౌన్ సిండ్రోమ్  పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ప్రేమ అనురాగాలు,ఎక్కువ శ్రద్ధ పిల్లల పట్ల చూపించినట్లయితే ఆ పిల్లల్లో మార్పు వస్తుందని ఆ పిల్లల పట్ల చిన్నచూపు చూడవద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జ్ పి పద్మావతి ఆమె కోరారు. జిల్లా కేంద్రంలోని  మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్ స్ట్ర క్షన్ ఆధ్వర్యంలో ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జ్ పి పద్మావతి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే ఇద్దరు పిల్లలకు సమానమైన తెలివితేటలు ఉండవని అట్లాగే  డౌన్ సిండ్రోమ్  పిల్లలు కొంచెం తెలివి తక్కువగా ఉంటారని వారికి విద్యాబుద్ధులు నేర్పించాలని కోరారు. డౌన్ సిండ్రోమ్ పిల్లల అభ్యున్నతికి జ్యోతి,సిద్దయ్యలు స్నేహ సొసైటీని ఏర్పాటు చేసి ఇలాంటి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అభినందించారు.  పిల్లలు వారు వేసిన డ్రాయింగ్స్,పెయింటింగ్స్ చాలా బాగున్నాయని నార్మల్ పిల్లలు కంటే కూడా బాగా వేశారని వారిని అభినందించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి మాట్లాడుతూ డౌన్ సిండ్రోమ్ పిల్లలు దేవుడిచ్చిన వరమని,తల్లిదండ్రులు భావించినప్పుడు ఆ పిల్లల అభివృద్ధి సక్రమంగా జరుగుతుందని ఇలాంటి పిల్లలను ప్రత్యేక పాఠశాలలో చేర్పించినప్పుడు వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారన్నారు.  స్నేహ సొసైటీలోని పిల్లలు యోగా ,డాన్స్, డ్రాయింగ్  ఎన్నో రంగాల్లో ముందున్నారని వారికి విద్యాబుద్ధులు అందించిన స్నేహ సొసైటీని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ వైద్యులు డాక్టర్ ప్రతిమ రాజ్ మాట్లాడుతూ స్త్రీ పురుషుల్లో23 జతల క్రోమోజోములు ఉంటాయని 21వ క్రోమోజోములోని ట్రైజోమ్ వల్ల  డౌన్ సిండ్రోమ్ పిల్లలు పుడతారని ఒక క్రోమోజం  అధికంగా ఉండటం వల్ల  డౌన్ సిండ్రోమ్ పిల్లలు పుడతారన్నారు. డౌన్ సిండ్రోం పిల్లల్లో సాధారణంగా మైల్ స్టోన్స్ అన్ని ఆలస్యంగా అభివృద్ధి చెందుతాయని కానీ వారికి సహకారాన్ని అందిస్తే వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇన్నమూరి రవితేజ,పిల్లల వైద్య నిపుణులు  అవినాష్,పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య,అందుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి,మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి,పిల్లల తల్లిదండ్రులు మానసిక మానసిక వికలాంగ విద్యార్థులు,సిబ్బంది పాల్గొన్నారు. డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీల్లో పాల్గొన్న డౌన్ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.