Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2025, 8:25 pm Posted by : ramakrishna

బంగారు భవిష్యత్తును బానిస బ్రతుకులుగా చేసుకోవద్దు

  • ఎస్సై సందీప్

 

భీమ్ గల్, బతుకమ్మ : మాదక ద్రవ్యాలకు బానిసలై విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును బానిస బ్రతుకుగా మార్చుకోవద్దని భీమ్ గల్ ఎస్సై సందీప్ అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ సురక్ష జాతీయ భద్రత కార్యక్రమం లో భాగంగా స్టూడెంట్ కౌన్సిలింగ్ కార్యక్రమంను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థుల దశలో ఏం చేయాలో,  ఎలా ఉండాలో గందరగోళమునకు సతమవుతమవుతున్నటువంటి దశ అని,  ఈ వయసులో మిమ్మల్ని ఆకట్టుకునే మత్తు పదార్థాలైన గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ఉండాలన్నారు. ఈ దశలో మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకుంటూ మీ యొక్క ఏకాగ్రతను చదువుపట్లనే దృష్టి సారించాలన్నారు.విద్యార్థులు సైబరు నేరాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీ జీవితాలను సక్రమమైన మార్గంలో నడిపించుకుంటూ కేవలము విద్యను అభ్యసించి రాబోయే రోజుల్లో మంచి స్థితిలో మీరు రాణించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో రక్షక శాఖ సిబ్బంది, కళాశాల అధ్యాపక బృందము, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Don't let a golden future become a slave life