. . . జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి
నందిపేట్, బతుకమ్మ :
రైతులు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి పక్ష పార్టీల మాటలు నమ్మి ధర్నాలు చేయవద్దని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ సారథ్యంలో రాష్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు. మా పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయిందని, వాగ్దానం చేసిన ప్రకారం రూ.2 లక్షల రుణ మాఫీ చేశామన్నారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని అటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు. ప్రతి పక్ష పార్టీలు అయినా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వడ్లు కొనట్లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జిల్లాలో 739 వడ్ల కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి 4 లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని అన్నారు. దాదాపు 50వేల మంది రైతుల దగ్గర వడ్లు కొనుగోలు చేసి 759 కోట్ల రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. అదే విదంగా మక్కలు మన జిల్లాలో 40వేల మెట్రిక్ టన్నుల పంట పండిదని, దీంట్లో నిన్నటి వరకు 2500 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి, మండల అధ్యక్షులు మహిపాల్, మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు లింగం, సొసైటీ చైర్మన్ సుదర్శన్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ నగేష్, జిల్లా ఉపాధ్యక్షులు గాదారి గోపి, డొంకేశ్వర్ మండల అధ్యక్షులు భూమేష్, సర్పంచ్లు జీవన్, సంజీవ రాజు, శ్రీను, నాగరాజు, నిఖిల్, కిష్టా గౌడ్, దేవేందర్, రాజేందర్, దూడ వెంకటేష్, మోర్తాడ్ ముత్యం, దయాకర్, సాయిరెడ్డి, నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.