Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2025, 2:12 pm Posted by : ramakrishna

బోగస్ ఉద్యోగాలు ఇవ్వొద్దు

హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాలకు బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి కానీ , నిరుద్యోగులకు  బోగస్ ఉద్యోగాలు ఇవ్వొద్దని  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.  హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద బుధవారం  జాగృతి ఆధ్వర్యంలో  గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ధర్నాలో కవిత పాల్గొని మాట్లాడారు. గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయాలని తెలంగాణ జాగృతి   టీజీపీఎస్సీని ముట్టడించిన  ప్రభుత్వంలో చలనంలేదన్నారు. ఇంతవరకు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్  రిలీజ్ చేయలేదన్నారు. పాత ఉద్యోగాలు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం  గొప్పలు చెప్పుకుంటుందన్నారు. గ్రూప్ 1 పరీక్ష రద్దు అయ్యే వరకు ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు మౌనం వీడాలన్నారు. గ్రూప్ 1 పరీక్ష పై హరగోపాల్ సార్ మాట్లాడాలన్నారు. రాహుల్ గాంధీ మాటలు నమ్మి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారన్నారు. నిరుద్యోగులను మోసం చేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులే కూలగొడుతారన్నారు. త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. తక్షణమే గ్రూప్-1  నియామకాలు రద్దు చేసి, తిరిగి మళ్లీ  పరీక్ష పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని,  ప్రెసిడెంటల్ ఆర్డర్ ద్వారా 8 మంది ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు.  ప్రెసిడెంటల్ ఆర్డర్ పైన మేము ఉద్యమం చేస్తామన్నారు.

Don't give bogus jobs.

Don't give bogus jobs.