Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 November 2024, 6:57 pm Posted by : ramakrishna

రోడ్లపై ధాన్యాన్ని పోసి ఇతరుల మరణానికి కారణం కావొద్దు

పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ

దుబ్బాక, బతుకమ్మ : రోడ్లపై ధాన్యాన్ని పోసి నల్ల కవర్ కప్పడం వల్ల ధాన్యం కుప్ప కనపడక ధాన్యము కుప్పకు ఢీకొని  చనిపోయిన సంఘటనలు సిద్దిపేట జిల్లాలో జరిగాయి. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి రోడ్లపై ధాన్యాన్ని పోయవద్దు అని  పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ అన్నారు. సిద్దిపేట  కమిషనర్  మాట్లాడుతూ రోడ్లపై ధాన్యం పోయడం వల్ల వాహనదారులు మోటార్ సైకిల్ వాహనదారులు రాత్రి సమయాలలో అది గమనించక  ప్రమాదం జరిగి చనిపోవుచున్నారు. బావి దగ్గర ఇండ్ల వద్ద లేదా ఇతర ప్రదేశాలలో ధాన్యం పోయడానికి ఏర్పాటు చేసుకోవాలి, నిర్లక్ష్యంగా రోడ్లపై ధాన్యం పోసి అమాయక  ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం కావొద్దు, రోడ్లపై ధాన్యం పోసి రాత్రి సమయంలో నల్ల కవర్ కప్పి చుట్టూ రాళ్లు పెట్టడం వల్ల అది గమనించని మోటార్ సైకిల్ వాహనదారులు తగిలి చనిపోవడం జరుగుతుంది. రోడ్లపై ధాన్యం పోయవద్దని పోలీస్ అధికారులు సిబ్బంది కూడా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరైనా ధాన్యాన్ని రోడ్లపై నిర్లక్ష్యంగా పోస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్  తెలిపారు.