Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 7:36 pm Posted by : ramakrishna

ఒకటో తరగతి పిల్లలపై భారం మోపొద్దు

 

. . . ఒకటవ తరగతి నుండి త్రిభాషా విధానం ప్రవేశపెట్టాలనడం సరికాదు

 

. . . డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శంతన్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఆడుతూ పాడుతూ విద్యను అభ్యసించే వయసు గల చిన్నారులకు ఒకటవ తరగతి నుండి తెలుగు హిందీ ఇంగ్లీషు పాఠ్యాంశాలుగా చేర్చాలి అనుకోవడం సబబు కాదని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శంతన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విద్యా కమిషన్ ముఖ్యమంత్రికి సమర్పించిన తెలంగాణ విద్యా విధానం 2026 రిపోర్టులో ఒకటో తరగతి నుండి మూడు భాషల విధానాన్ని ప్రవేశపెట్టాలని సిఫారసు చేయడం సరికాదని, త్రిభాషా విధానం వల్ల విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరిగి విద్యాభివృద్ధి కుంటుపడుతుందని, ఈ విధానము పై పునసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విద్య కమిషన్ ముఖ్యమంత్రి కి సమర్పించిన తెలంగాణ విద్యా విధానం 2026 రిపోర్టులో ఉపాధ్యాయ నియామకాలు పదోన్నతులు వేతనాలపై చేసిన ప్రతిపాదనలు తెలంగాణ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల రవాణా ఖర్చులను పిల్లల తల్లిదండ్రులే భరించాలని ప్రతిపాదనను విద్యారంగంలో ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. విద్యారంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అట్లాంటి ప్రతిపాదనలను సవరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యారంగానికి బడ్జెట్లో 18 శాతం నిధులు కేటాయించాలని విద్యాహక్కు చట్టం 3 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ వర్తింపజేయాలని, పూర్వ ప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించాలని, మధ్యాహ్న భోజనం పథకంలో ఉదయం పాలు అల్పాహారము సాయంత్రం స్నాక్స్ ఇవ్వడమే కాకుండా యూనిట్ ఖర్చు పెంచి సత్వర చెల్లింపులు చేయాలని, కళాశాలలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని కాపాడాలని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ మొదలగు అంశాలపై విద్యా కమిషన్ ఈచేసిన ప్రతిపాదనలను స్వాగతిస్తు ప్రభుత్వం వాటిని చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. ప్రస్తుతo నిర్వహించబడుతున్న అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చి ఖాళీ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ సర్వీసు సమస్యను పరిష్కరించి పర్యవేక్షణ విధానాన్ని మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలను మూసివేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు.