Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 January 2025, 6:12 pm Posted by : ramakrishna

రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ అవ్వకు బువ్వ

ఆర్మూర్, బతుకమ్మ :  రక్ష స్వచ్చంద సేవా సంస్థ, ఆర్మూర్ వారి ఆధ్వర్యములో ఆర్మూర్ పట్టణములోని జిరాయత్ నగరులో గల విద్యా హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన “అవ్వకు బువ్వ” కార్యక్రమములో ప్రతి నెలలో భాగంగా పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా దాదాపు 56 మంది పేదవృద్దులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేష్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్ లు మాట్లాడుతూ అవ్వకు బువ్వ కార్యక్రమం ద్వారా పేద వృద్దులకు తమవంతు సహకారం అందిస్తున్నామని, మానవ సేవయే మాధవ సేవ” అని అన్నారు. రక్షా స్వచ్చంధ సేవా సంస్థ తరపున త్వరలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు జిందమ్ నరహరి, విద్యా గోపి కృష్ణ కోశాధికారి గొనె శ్రీధర్, కార్యనిర్వహక కార్యదర్శులు డి ఆర్.బేతు గంగాధర్, ఖాందేష్ సత్యం, తులసి పట్వారి, సభ్యులు శరత్, విష్ణు, చైతన్య, కళ్యాణ్, సాయి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.