Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 March 2025, 6:07 pm Posted by : ramakrishna

ధాన్యం దళారులకు విక్రయించి మోసపోవద్దు : ఎమ్మెల్యే పోచారం

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ నియోజకవర్గంలో యాసంగి వరికోతలు జిల్లాలోనే ముందుగా ప్రారంభమయ్యాయని ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.నస్రుల్లాబాద్ మండలం మైలారం సొసైటీ పరిధిలోని తిమ్మాపూర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బీర్కూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు దుర్గం శ్యామల, తహశీల్దార్ లత, పెరిక శ్రీను, శశి, శంకర్, రాములు తదితరులు పాల్గొన్నారు.