ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కొనుగోలు కేంద్రాన్ని నిజామాబాద్ ఆర్డిఓ రాజేందర్ కుమార్ సోమవారం ప్రారంభించారు.అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ తాహసిల్దార్ వెంకట్రావు,పిఎసిఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డిలకు పలు సూచనలు చేశారు. రైతులు తెచ్చిన వరి ధాన్యాన్ని వెనువెంటనే తూకం చేయాలన్నారు. వరి ధాన్యం గ్రేడ్ ఏ కు 2389 రూపాయలు,,కామన్ వరి ధాన్యానికి 2369, రూపాయలు,ప్రభుత్వం చెల్లిస్తుందని రైతులకు తెలిపారు. రైతులు దళారులను నమ్ముకొని ధాన్యాన్ని అమ్ముకుంటే హరిగోశలు పడాల్సి వస్తుందని సూచించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన వరి ధాన్యాన్ని వెను వెంటనే మ్యాచర్ ద్వారా చూసి తొందరగా మార్కెట్ యార్డుకు లారీలలో తరలించేటట్లు చూడాలని తెలిపారు. లారీల కొరత ఉన్నట్లయితే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. వరి ధాన్యాన్ని తరలించే క్రమంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా బాధ్యత వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి,మాజీ పిఎసిఎస్ చైర్మన్ గోపాల్, ఇందల్వాయి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సాహెందర్, ఇందల్వాయి మున్నూరు కాపు అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బైరి రవి, మాణిక్యం గంగారం డాక్టర్ పరమేష్ ఆర్ ఐ మోహన్,వీడిసి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు,క్లస్టర్ అధికారి సత్యనారాయణ,మానిటరింగ్ అధికారి మయూరి,సెక్రెటరీ శ్రీకాంత్,సెంటర్ ఇన్చార్జ్ ప్రసాద్, కిషన్,మెండే రవి, మల్లయ్య,రైతులు తదితరులు పాల్గొన్నారు.