Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 February 2025, 2:06 pm Posted by : ramakrishna

వ్యసనాలకు బానిసలు కావొద్దు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: విద్యార్థులు వ్యసనాలకు బానిసలు కావొద్దని డాక్టర్ వినయ్ ధన్ పాల్ అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంత్యుత్సవాల సందర్భంగా నిర్వహించిన ఖేలో భారత్ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఖేలో భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. . భారత దేశానికి స్వాతంత్రం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తే స్వాతంత్రం వచ్చాక జాతీయవాదం కోసం ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఘనత ఏబీవీపీకి దక్కుతుందన్నారు. అనంతరం వివిధ కళాశాల నుండి ఖేలో భారత్ లో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులకు ముఖ్యఅతిథి చేతుల మీదుగా బహుమతుల ప్రధానం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి లావణ్ జీఇందూర్ ప్రముఖ్ రెంజర్ల నరేష్ గారువిభాగ్ సంఘటన మంత్రి రాజ్ సాగర్విభాగ్ కన్వినర్ శశి తదితరులు పాల్గొన్నారు.

Don't be addicted to addictions