Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 2:31 pm Posted by : ramakrishna

తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా కార్యదర్శిగా దొండి స్వర్ణలత

 

ఇందూర్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత బతుకమ్మ సంబరాలు అన్ని జిల్లాలలో విస్తృతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా తెలంగాణ జాగృతి సమక్షంలో నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రసిద్ధిగాంచిన బతుకమ్మ పండుగను వేడుకలను రంగ రంగ వైభవంగా నిర్వహించాలని కమిటీని నియమించింది. అందులో భాగంగానే తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళ కార్యదర్శిగా దొండి స్వర్ణలత ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా కార్యదర్శి దోండి స్వర్ణలత మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో ఈ పదవి బాధ్యతులు అప్ప చెప్పినందుకు తెలంగాణ జాగృతి కమిటీకి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. అదే విధంగా అప్పచెప్పిన బాధ్యతలను పూర్తి బాధ్యతగా నెరవేరుస్తానన్నారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ప్రాంత ప్రజల సాంప్రదాయబద్ధమైన బతుకమ్మ పండగను తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను తెలంగాణ జాగృతి నిర్వహించే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని, తెలంగాణ సాంస్కృతిక వికాసం కోసం తోడ్పడతానని అన్నారు.