జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విరాళం

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సైన్స్ ల్యాబ్ ఫర్నిచర్ కోసం రూ. 15,000/- విరాళం అందజేసిన కుమారి గవ్వాజి పూజిత (రేణుకాదేవి కుమార్తె) ఎస్‌.ఏ. బయో సైన్స్)ను శనివారం ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రఘునందన చారి మాట్లాడుతూ  వారి ఔదార్యం మా విద్యార్థుల విద్యా వాతావరణాన్ని మరింత అభివృద్ధి పరచడమే కాక, వారికి విజ్ఞాన సాధనలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుందని అన్నారు. సమాజానికి తోడ్పాటు అందించే ఇలాంటి దాతృత్వం అందరికీ ప్రేరణగా నిలుస్తుందని...