Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 October 2024, 6:15 pm Posted by : ramakrishna

స్నేహ సొసైటీ లో విద్యార్థులకు అన్నదానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్నేహ సొసైటీ విద్యార్థులకు ఒక్క రోజు అన్నదానం కార్యక్రమాన్ని ధర్పల్లి మండలం వాడి గ్రామానికి చెందిన పటెండ్ల (కర్క) రాములు- బోజమ్మ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారని స్నేహ సొసైటీ వ్యవస్థాపకులు సిద్దయ్య, స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి లు అన్నారు. శుక్రవారం నగరంలోని మారుతి నగర్ లో. గల స్నేహ సొసైటీ లో విద్యార్థులకు ఒక్క రోజు బోజన కార్యక్రమాన్ని పటెండ్ల, కర్క రాములు- బోజమ్మ కుటుంబ సభ్యులు అందజేశారు. విద్యార్థుల లతో కలసి సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి మాట్లాడుతూ.. మా సొసైటీ విద్యార్థులకు ఒక్క రోజు భోజనం అందించాలని మంచి మనసుతో ఏర్పాటు చేసిన రాము, రమేష్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. యువత పేడ దారిన పడుతున్న ఈరోజుల్లో గల్ఫ్ లో ఉద్యోగం చేస్తూ ఇండియాకు వచ్చిన సందర్భంగా విద్యార్థుల కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. వీరిని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భోజనం తో పాటు విద్యార్థులకు అవసరం అయ్యే నోట్ పుస్తకాలు, పెన్నులు ఇతర సామగ్రి అందజేయవచ్చని అన్నారు. ఈ సందర్భంగా రాములు- బొజమ్మ లు మాట్లాడుతూ గల్ఫ్ లో ఉన్న చిన్న కుమారుడు కుమారుడు రాము, పెద్ద కుమారుడు రమేష్ ల కోరిక మేరకు విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ..తమ వంతుగా విద్యార్థులకు భోజనం అందజేయడం సంతోషంగా ఉందని, స్నేహ సొసైటీ కి మా సహాయ సహకారాలు ఎల్లపుడు ఉంటాయని అన్నారు. అందరూ బర్త్ డే, పెళ్లి రోజు వేడుకలు ఇక్కడ జరుపుకుని విద్యార్థులకు బోజనం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పేటెండ్ల లక్ష్మి, రమేష్, శివ, నితిన్, నరేష్ పాల్గొన్నారు.