Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 April 2025, 4:26 pm Posted by : ramakrishna

హనుమాన్ ఆలయానికి విరాళం

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామానికి చెందిన తెల్ల గోపి స్వామి సేవలు అభినందనీయమని హనుమాన్ ఆలయ కమిటీ నిర్వాహకులు, హనుమాన్ స్వాములు,  కొనియాడుతున్నారు. హనుమాన్ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయంగా చందాల రూపంలో గత సంవత్సరంలో 11 వేల రూపాయలు, ఈ సంవత్సరంలో 6 వేల రూపాయలు చందాలు అందజేశారు. గత రెండు సంవత్సరాలనుండి ఆలయ అభివృద్ధికి తనవంతుగా సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఆయనకు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని హనుమాన్ ఆలయ కమిటీ నిర్వాహకులు, హనుమాన్ స్వాములు స్వామి వారిని వేడుకున్నారు.