అందజేసిన మైసూరు రాజమాత ప్రమోదాదేవి
తిరుమల, బతుకమ్మ : తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండాలు (అఖండ దీపాలు)ను సోమవారం విరాళంగా అందజేశారు. రంగనాయకుల మండపంలో వీటిని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు,ఆలయ అధికారులకు అందించారు. ఒక్కో వెండి అఖండం సుమారు 50 కిలోల బరువుంటుంది. ఈ అఖండాలు గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహా రాజు ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందించినట్లు చరిత్రలో ఉంది. ఇప్పుడు మళ్లీ మైసూరు రాజమాత వాటిని సమర్పించడం విశేషం.
