బిజేవైయం ఉపాధ్యక్షుడు సంతోష్ దాతృత్వం
బాల్కొండ, బతుకమ్మ: భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యాక్షుడు సంతోష్ వేంపల్లిలోని పురాతన శివాలయం పున: నిర్మాణానికి భారీగా విరాళం ప్రకటించి అందచేశారు. ముప్కాల్ గ్రామానికి చెందిన సంతోష్ తమ సొంత గ్రామంలోని పురాతన రాజ రాజేశ్వర దేవాలయం శిథిలావస్థకు చేరడంతో భారీగా విరాళం రూ.9,11,116 రూపాయల చెక్ ను గ్రామస్థులకు అందచేశారు. ఈ సందర్భం గా గ్రామంలో శివాలయం పునరుద్ధరణకు సంతోష్ భూమి పూజ చేశారు. అంతకు ముందు గ్రామస్ధులు, ఆలయ కమిటీ, వీడీసీ ఆధ్వర్యంలో కళశాలతో ఉరేగింపుగా వెళ్లి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదానం చేశారు. సంతోష్ దాతృత్వం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
