బతుకమ్మ, బోధన్: బోధన్ పట్టణ అభివృద్ధి కమిటీ మరియు మహాలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని 16వ వార్డులో శిధిలావస్థలో ఉన్న పోచమ్మ ఆలయాన్ని కూల్చి, భక్తుల సౌకర్యార్థం నూతన ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా వార్డు నివాసి కొత్త రాజేశ్వర్ తన తల్లి, తండ్రులైన కొత్త గోవింద్, బక్రమ్మ గారి స్మారకార్థంగా రూ.51,001/- విరాళాన్ని పట్టణ అభివృద్ధి కమిటీకి అందించారు. పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త ప్రదీప్ గుప్తా తన స్వంత ఖర్చులతో ఆలయంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మరోవైపు సునీల్ రూ.11,000/- విరాళాన్ని ఆలయ నిర్మాణానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గంగాధర్ రావు పట్వారి, కార్యదర్శి బీర్కూర్ శంకర్, కోశాధికారి గమరపేట శ్రీను, మారుతి మందిరం చైర్మన్ గుండెడి శంకర్, ఉద్మీర్ సాయిలు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.