రామాలయం పున: నిర్మాణానికి విరాళం అందజేత

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో గల శ్రీ రామ మందిర పున: నిర్మాణంలో భాగంగా వర్ని మండలం తగిలేపల్లి గ్రామ వాస్తవ్యులు గంగా వెంకటేశ్వర్ (శ్రీ వేంకటేశ్వర బిన్నీ రైస్ మిల్) 101116/-రూపాయలు గురువారం శ్రీ రామాలయ కమిటీ సభ్యులకు విరాళాన్ని అందజేశారు. విరాళాన్ని అందజేసిన వారి కుటుంబ సభ్యులకు శ్రీ సీతరామ ఆలయ కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తి రాము స్వామి, పత్తి నవీన్ స్వామి, అడప నవీన్, బచ్చు పవన్ తదితరులు ఉన్నారు.