Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 February 2025, 5:20 pm Posted by : ramakrishna

రక్తదానం మరొకరికి ప్రాణదానం

బోధన్, బతుకమ్మ :  రక్తదానం ప్రాణ దానంతో సమానం. నేటికీ ఎందరో అత్యవసర సమయంలో రక్తం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. రక్త దానమిచ్చేందుకు ముందుకు వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంది. కానీ బోధన్ కు చెందిన అల్లాడి దేవా అనే యువకుడు శివాజీ బ్లెడ్ గ్రూప్  సోషల్ మీడియా ద్వారా  గత ఐదు సంవత్సరాలుగా ఆపదలో ఉన్నవారికి రక్తం అందెలాచూస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు. అత్యవసర పరిస్థితిలో తానే   ఇప్పటివరకు ఇరవై సార్లు రక్తాన్ని దానం చేసి ఆదర్శంగా నిలిచాడు. మన దేశంలో ప్రతి రెండు సెకండ్లకు ఒకరికి రక్తం అవసరమవుతుందని  రక్తదాతలు ముందుకొస్తే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని శివాజీ బ్లడ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిచానున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు  రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు.