బాన్సువాడ, బతుకమ్మ : అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని బాన్సవాడ పట్టణంలోని ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ నందు రక్త దానం చేయడం జరిగింది. పేద గర్భిణులకు ఆదుకోవాలని సంకల్పంతో మీరిచ్చే రక్తం మరొకరికి జీవితం ఒకరికి దానం మరొకరికి ప్రాణం. కాబట్టి యువత ముందుకు వచ్చి రక్తదానం చెయ్యడం జరిగింది. ఈ రక్త దాన దినోత్సవం జరపడానికి ముఖ్య అతిథులు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ విజయ లక్ష్మి, ఆర్.ఎం.ఓ.సుజాత, ల్యాబ్ టెక్నీషియన్ రఘు పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా రక్తదానం చేసిన వారు ఎండి గౌస్ ఇప్పటివరకు 51 సార్లు రక్తదానం చేశారు. రాథోడ్ సునీల్, మహేష్, సూర్యకాంత్, రవీందర్, శేఖర్, గణేష్, మస్తాన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.