Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 10:44 pm Posted by : ramakrishna

విరాళంగా స్వర్గ రథం

  • మార్గదర్శి స్వచ్చంద సంస్థ ఉదారం

 

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని పురానిపేట గ్రామానికి మార్గదర్శి స్వచ్చంద సంస్థ సభ్యులు స్వర్గ రథాన్ని విరాళంగా అందజేశారు. సోమవారం ఎంపీడీఓ సంతోష్ కుమార్ సమక్షంలో ఈ స్వర్గ రథన్ని గ్రామానికి విరాళంగా ఇచ్చి గ్రామానికి అంకితం వారి ఉదారాతను చాటుకున్నారు.ఈ సందర్బంగా ఎంపిడీఓ మాట్లాడుతూ యువత సమాజ సేవా పై దృష్టి సారించి ఇలాంటి ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సందర్బంగా సంస్థ సభ్యులందరిని పేరు పేరున అభినదించారు. ఈ కార్యక్రమం లో గ్రామా కమిటీ పెద్దలు,మాజీ సర్పంచ్ లు తోట శంకర్, బుర్ర దేవేందర్ గౌడ్,వెల్డింగ్ రవి, సుధాకర్, జీపీ సెక్రెటరీ, గ్రామా యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.