Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 December 2024, 3:08 pm Posted by : ramakrishna

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి

. . .అధనపు పొలిస్ కమీషనర్ బస్వా రెడ్డి

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

యువత ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా దానగుణాన్ని అలవర్చుకొని తమకు తోచిన  సహయం అందజేయాలని  నిజామాబాద్ అధనపు పొలిస్ కమీషనర్ గట్టు బస్వారెడ్డి కోరారు . రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు  తోట రాజశేఖర్ పుట్టిన రోజును పురస్కరించుకోని అదివారం తలసేమియా బాధితుల కోసం రెడ్ క్రాస్ లో రక్త దాన శిభిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హజరైన డిసిపి ( అడ్మిన్ ) బస్వారెడ్డి మాట్లాడుతు…విజ్ఞానం కావచ్చు అది రక్తదానం కావచ్చు ఏదో ఒక రూపంలో దానం చేయటం అవసరం అన్నారు. ఉన్నవారు లేని వారికి చేయడంతో దానగుణాన్ని పెంపొందించుకోవచ్చని ప్రతి ఒక్కరూ సమాజ సేవలో మమేకమై తమ వంతుగా అందరూ నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో తోట రాజశేఖర్ 82 వ సారి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ బి ఆంజనేయులు, కోశాధికారి కరిపే రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటకృష్ణ, డాక్టర్ రవీందర్, సెక్రటరీ అరుణ్ బాబు, వెంకటేశం, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్ తదితరులు ఉన్నారు.