కమర్షియల్ అవసరాలకు గృహ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు
ఇష్టారాజ్యంగా సబ్సిడీ సిలిండర్ల వ్యాపారం బాన్సువాడ, బతుకమ్మ : హోటల్లు, టిఫిన్ సెంటర్లు,రెస్టారెంట్లు,కర్రీ పాయింట్,పర్మిట్ రూములు ఇలా మొదలుకొని ప్రతి ఒక్క షాపులో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాడాలి కానీ గ్యాస్ ఏజెన్సీలు అధిక డబ్బుకు ఆశపడి హోటళ్లకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నారని కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సాధారణ ప్రజలకు గృహ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉండడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీంతో బాన్సువాడ పట్టణంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్...