Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 7:31 pm Posted by : ramakrishna

డొమెస్టిక్ సిలిండ‌ర్లు పట్టివేత

 

రుద్రూర్, బతుకమ్మ :

 

గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లు వ్యాపార అవసరాలకు వాడుతున్నార‌న్న స‌మాచారంతో రుద్రూర్ మండల కేంద్రంలో సివిల్ స‌ప్ల‌య్ అధికారులు ప్రవీణ్ కుమార్, మహేష్ లు సోమవారం హోటల్ లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, దాబాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 6 డొమెస్టిక్ సిలిండ‌ర్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపార అవ‌స‌రాల కోసం వినియోగిస్తే చర్యలు త‌ప్ప‌వ‌ని వారు హెచ్చరించారు.