బిచ్కుందలో కుక్కల బెడద
భయాందోళనలో చిన్నారుల తల్లిదండ్రులు పట్టించుకోని పంచాయతీ సిబ్బంది కాపాడాలని ప్రజల వేడుకోలు బతుకమ్మ: బిచ్కుంద : వీధి కుక్కల స్వైర విహారంతో బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రజలు బెంబేలేత్తూతూన్నారు. పలు వార్డుల్లో రోడ్లపై కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. చిన్నారులు, వాహనదారులపై కుక్కలు దాడి చేసి గాయపరుస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఏ కుక్క ఎక్కడ కరుస్తుందో అన్న భయంతో పిల్లలు రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో గుంపులుగా తిరుగుతూ పిల్లలపైకి దాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవల కాలంలో బిచ్కుంద పట్టణంలో ఓ...