Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 November 2024, 7:47 pm Posted by : ramakrishna

బిచ్కుందలో కుక్కల బెడద

భయాందోళనలో చిన్నారుల తల్లిదండ్రులు

పట్టించుకోని పంచాయతీ సిబ్బంది

కాపాడాలని ప్రజల వేడుకోలు

బతుకమ్మ: బిచ్కుంద : వీధి కుక్కల స్వైర విహారంతో బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రజలు బెంబేలేత్తూతూన్నారు. పలు వార్డుల్లో రోడ్లపై కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. చిన్నారులు, వాహనదారులపై కుక్కలు దాడి చేసి గాయపరుస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఏ కుక్క ఎక్కడ కరుస్తుందో అన్న భయంతో పిల్లలు రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో గుంపులుగా తిరుగుతూ పిల్లలపైకి దాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవల కాలంలో బిచ్కుంద పట్టణంలో ఓ చిన్నారిపై కొన్ని వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అలాగే బిచ్కుంద మండల కేంద్రంలో పలువురు పలుమార్లు వీధి కుక్కల దాడిలో గాయపడ్డారు. ఇప్పటికైనా వీధి కుక్కల బెడద నుండి తమను కాపాడాలని అధికారులకు మొరపెట్టుకుంటున్నప్పటికీ పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు.
బిచ్కుంద మండల కేంద్రంలో గ్రామ సింహాల బెడద తప్పించడంలో పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వీడడం లేదు గడిచిన కొన్నాళ్లుగా ఈ ప్రాంత ప్రజలకు కుక్కల భయం బెడద తప్పడం లేదు. బిచ్కుంద మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీలో అనేక వీధులలో పదుల సంఖ్యలలో ఒక్కసారిగా గుమిగూడి వీధుల వెంట తిరుగుతూ వీధి కుక్కలు చిన్నారులు, పెద్దలపై తిరగబడి కరుస్తూ దాడులకు పాల్పడుతున్నాయి కాగా ఇటీవల కాలంలో బిచ్కుంద పట్టణంలోని ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అయినప్పటికిని పంచాయతీ అధికారులు వీధి కుక్కలను తరలించడంలో తమ నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నార నే వాదన సైతం ప్రజల నుండి అధికంగా వినిపిస్తున్నాయి. పలుమార్లు వీధి కుక్కల బెడద నుండి తమను కాపాడాలని పంచాయతీ అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీని అధికారులు మొండి వైఖరిని అవలంబిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇంటి నుండి తమ పిల్లలకు బయట పంపించాలంటే తల్లిదండ్రులు వీధి కుక్కలు అంటే భయపడుతూ వారికి బయటకు పంపించడానికి జమ్ముతున్నారు. రోడ్డు వెంట తిరిగే వీధి కుక్కలు గుంపు ద్విచక్ర వాహనదారుల వెంట పరిగెడుతూ భయభ్రాంతులకు గురి చేయడంతో అనేకమంది ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి వాహనంపై నుండి క్రిందపడి తీవ్ర గాయాల పాలవుతున్నారు. మరికొందరు ద్విచక్ర వాహనదారులపై వీధి కుక్కలు దాడికి పాల్పడి కరుస్తూ గాయపరుస్తున్నాయి. అదేవిధంగా రాత్రిపూట ద్విచక్ర వాహనాలపై పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే వారిపై వీధి కుక్కలు వెంటపడి అరుస్తూ దాడి చేయడంతో వాహనాలపై నుండి కిందపడి గాయాల పాలవుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రధాన కూడలి లలో గుంపులు గుంపులుగా ఉండే శున, వ్యాధి బారిన పడి రోడ్లపై తిరుగుతున్న వాటిని సైతం గ్రామాల నుండి తరలించాలని ప్రజలు వేడుకుంటున్నారు.

Dogs in Bichkunda