కుక్కలు బాబోయ్..

భయాందోళనలో స్థానికులు బెంబేలెత్తుతున్న చిన్నారులు, వృద్ధులు  పట్టించుకోని మున్సిపాలిటీ అధికారులు   బాన్సువాడ, బతుకమ్మ  :  ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టాలంటూ బాబోయ్‌.. కుక్కలు అంటూ ప్రజలు బెంబేలెత్తుతున్నారు.పలు కాలనీల్లో గుంపులు గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో చిన్నారులు, వృద్ధులు భయాందోళనలకు గురవుతున్న సంఘటనలు బాన్సువాడ మున్సిపాలిటీలో చోటుచేసుకుంటున్నాయి.బాన్సువాడ మున్సిపాలిటీ లోని ఏ వార్డులో చూసినా కుక్కల గుంపు కనబడుతోంది.కాలనీలో ఒంటిరిగా వెళ్లాలంటేనే కాలనీవాసులు జంకుతున్నారు.ఉదయం వేళ స్కూల్‌ బస్సులకు కోసం కాలనీల్లో విద్యార్థులు వేచి ఉంటున్న సందర్భంలో కుక్కల గుంపును చూసిన విద్యార్థులు...