బాలికపై కుక్కల దాడి

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్  పట్టణంలోని వేంకటేశ్వర కాలనీ ఆలయ ప్రాంతంలో బుధవారం సాయంత్రం హన్సిక అనే బాలికపై కుక్కలు దాడిచేశాయి. బాలిక ఆడుకుంటుండగా అవి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలికను ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్​కు తరలించాలని వైద్యులు సూచించారు. హన్సికతో పాటు మరో ఇద్దరు చిన్నారులపై దాడి చేశాయి. ఆర్మూర్లో కుక్కలు ప్రతి వార్డులలో విపరీతంగా ఉంటున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. బయటికి పిల్లలు వెళ్లడానికి భయపడుతున్నారు.