పోలీస్ స్టేషన్ కు కుక్కల బెడద

బతుకమ్మ, కోటగిరి : రక్షణ నిలయానికే  పెద్ద చిక్కు వచ్చి పడింది. గత కొద్ది రోజులు కోటగిరి మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ లో పదుల సంఖ్యలో కుక్కలు తిష్ట వేసుకుని ఉండడంతో  తమ సమస్యల పరిష్కారానికి వచ్చే  ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్ ఆవరణంలో గుంపులు గుంపులుగా ఉన్న కుక్కలు ఎక్కడ తమ పై దాడి చేస్తాయో అన్న భయంతో ఆందోళన గురై  పోలీస్ స్టేషన్లలోకి వెళ్లేందుకు జంకుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి కుక్కల బెడద తగ్గించాలని  ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.