తెలంగాణ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన పోచారం
బాన్సువాడ బతుకమ్మ :
రాఖీ పౌర్ణమి (రక్షా బంధన్) పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో శుక్రవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కి తన సోదరీమణి దొడ్ల సత్యవతి రాఖీ కట్టి ఆత్మీయంగా ఆశీర్వదించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూఅన్నా–చెల్లెళ్ల అనుబంధానికి, అక్కా–తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ. ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, ఆత్మీయతలకు ప్రతీకగా నిలిచే ఈ పవిత్రమైన రక్షా బంధన్ వేడుకను ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా అన్నా–చెల్లెళ్ల అనుబంధం,అక్కా–తమ్ముళ్ల ఆత్మీయత ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు