దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు
బతుకమ్మ, బోధన్: నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయంలో దొడ్డి కొమరయ్య 98వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన తొలి తెలంగాణ అమరుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు. రజాకార్లకు, పెత్తందారులకు, జమీందారులకు వ్యతిరేకంగా రైతుల కోసం పోరాడిన వ్యక్తి దొడ్డి కొమరయ్య అని అన్నారు. ఈ కార్యక్రమములో సాలురా తహసిల్దార్ శశి భూషణ్, పిఎసిఎస్ చైర్మన్ అల్లే జనార్ధన్, మందర్న గ్రామ...