బతుకమ్మ, బోధన్: నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయంలో దొడ్డి కొమరయ్య 98వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన తొలి తెలంగాణ అమరుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు. రజాకార్లకు, పెత్తందారులకు, జమీందారులకు వ్యతిరేకంగా రైతుల కోసం పోరాడిన వ్యక్తి దొడ్డి కొమరయ్య అని అన్నారు. ఈ కార్యక్రమములో సాలురా తహసిల్దార్ శశి భూషణ్, పిఎసిఎస్ చైర్మన్ అల్లే జనార్ధన్, మందర్న గ్రామ మాజీ సర్పంచ్ రావుబాగంగాధర్, సహకార సంఘం అధ్యక్షులు దేవరావు, బోధన్ మండల కురుమ సంఘ అధ్యక్షులు మేడి రవి, సంఘం సభ్యులు శంకర్, సాయిలు, భూమన్న, వెంకట్, పటేల్, ప్రకాష్, శివకుమార్, శివకాంత్, మేత్రి పిరాజీ, సురేష్, నవీన్, సాయిలు, కురుమ కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.