వైద్యులు అందుబాటులో ఉండాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ : సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశించారు. రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి రామారెడ్డి ఆసుపత్రిలో ఉన్న సేవల గురించి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలలో అందుతున్న సేవల...