Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 July 2025, 3:18 pm Posted by : ramakrishna

వైద్యులు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలి

  • కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

మద్నూర్, బతుకమ్మ: సీజన్ వ్యాధులు వ్యాపిస్తున్న సందర్భంగా వైద్యులు రోగులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ వైద్యులను ఆదేశించారు. బుధవారం మద్నూర్ మండల కేంద్రంలో ఆయన పర్యటించి మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేశారు. సీజన్ వ్యాధులు వ్యాపిస్తున్న సందర్భంగా వైద్యులు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని వైద్యులకు ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను వ్యక్తిగతంగా రోగులకు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి రికార్డులు, పరిసరాలను పరిశీలించారు.

Doctors should always be available

  • ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగవంతం పెంచాలి..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగవంతం పెంచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ పనులను పరిశీలించి, ఓ లబ్ధిదారుని ఇంటి ముందు చెట్టు నాటారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, వైద్య అధికారి విజయలక్ష్మి, డాక్టర్ ఆనంద్ జాదవ్, తహసిల్దార్ ఎండి ముజీబ్, ఎంపీడీవో రాణి, వివిధ శాఖల అధికారులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Doctors should always be available