Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 July 2025, 5:12 pm Posted by : ramakrishna

డాక్టర్లు భగవంతునితో సమానం

  • ఆర్కె విద్యాసంస్థల సీఈవో డాక్టర్ జైపాల్ రెడ్డి

 

కామారెడ్డి, బతుకమ్మ : డాక్టర్లు భగవంతునితో సమానమని ఆర్కె విద్యాసంస్థల సీఈవో డాక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఫరీదా బేగం ను సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి.ఆర్.కె జూనియర్, ఒకేషనల్ కళాశాల,కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కె విద్యాసంస్థల సీఈవో డాక్టర్ జైపాల్ రెడ్డి, కామారెడ్డి రక్తదాతల దాతల సమూహ ఫౌండర్ డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రపంచంలో డాక్టర్లు కు మాత్రమే భగవంతుని తరువాత భగవంతుని స్థానాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతూ ఆదర్శంగా నిలుస్తున్న వైద్యుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. కరోనా వ్యాధి సమయంలో ప్రజల  ప్రాణాలను కాపాడడం కోసం ప్రయత్నించి కొందరు డాక్టర్లు కరోనా వ్యాధికి బలి కావడం జరిగిందని వారి సేవలు చిరస్థాయిలో నిలిచిపోతాయని అన్నారు. డాక్టర్ ఫరీదా బేగం మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటినుండే ఉన్నత స్థాయి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని దానిని సాధించడం కోసం సరియైన ప్రణాళిక,దృఢ సంకల్పం, కష్టపడే స్వభావం ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాన్ని అయినా అధిరోహించవచ్చునని సూచించారు. డాక్టర్ వృత్తిలోకి రావాలనుకునే విద్యార్థులు ఇప్పటినుండి సహనం,ఓపిక కష్టపడే తత్వాన్ని పెంపొందించుకోవాలని అప్పుడే విజయాన్ని సాధించగలుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శంకర్,డీన్ నవీన్ కుమార్,అధ్యాపకులు ప్రసన్న, శ్రీవాణి,సంజ్యోతి,శ్రీనివాస్, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

Doctors are equal to God.1985