జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్కకు డాక్టరేట్స్ అసోసియేషన్ వినతి

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని సౌత్ క్యాంపస్ డాక్టరేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్కకు, ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ కి మంగళవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కల కలగానే మిగిలిపోతుందని, గతంలో పిసిసి అధ్యక్షుని హోదాలో ప్రస్తుత  రాష్ట్ర ముఖ్యమంత్రి  ఏనుముల రేవంత్ రెడ్డి సైతం తెలంగాణ విశ్వ విద్యాలయంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారని  ఇదే విషయమై ప్రభుత్వ పెద్దల ఆదేశానుసారం ఉన్నత విద్యా...