కారేగాం తాండా వాసి రమావత్ లాల్ సింగ్‌కు డాక్టరేట్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం కారేగాం తండా కు చెందిన రమావత్ లాల్ సింగ్ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. 2018 వ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పి.హెచ్.డి సీటు సాధించి భారత దేశం స్వాతంత్య్రం అనంతరం దేశంలోని సంస్కృతి సంప్రదాయాల మధ్య జరుగుతున్న ఘర్షణ పై పరిశోధన చేశారు.ఉస్మానియా విశ్వవిద్యాలయంహిందీ విభాగంలో సమకాలిన్ హిందీ ఉపన్యాస్ మే ఎక్ సాంప్రదాయక్ సంఘర్ష్ (1950 -2000) అనే అంశంపై ఆయన సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించారు....