Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 July 2025, 6:17 pm Posted by : ramakrishna

ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్.వరలక్ష్మికి డాక్టరేట్ ప్రదానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ ఆర్యాని సకల కళా వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయి 2025 భారత విభూషణ్ అవార్డుల ప్రదాన ఉత్సవం తల్లి నీకు వందనం  ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో ఫిలిం భవన్ లో జరిగింది.  వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి జాతీయస్థాయి భారత విభూషణ్ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాహితీ రంగంలోరాణిస్తున్న డొంకేశ్వర్ మండలంలోని ఎంపీపీఎస్ తొండాకూర్ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్. వరలక్ష్మి డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అవార్డును ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా డాక్టర్ దూడపాక శ్రీధర్,  కవి గేయ రచయిత చిత్రకారుడు, ముఖ్య అతిథిగా డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారు, విమర్శకులు శతాధిక పుస్తక ప్రచురణ కర్త, విశిష్ట అతిథులుగా డాక్టర్ గీతారెడ్డి, ప్రముఖ చర్మ వైద్య నిపుణులు ప్రొఫెసర్ ప్రతిమ మెడికల్ కళాశాల, పొర్ల వేణుగోపాల్ రావు గారు ప్రముఖ కవి సమీక్షకులు, కుంచాల లావణ్య ప్రముఖ స్త్రీ అలంకరణ నిపుణులు, కవులు కళాకారులు పాల్గొన్నారు.

Doctorate conferred on Principal CH. Varalakshmi