అపరిచితులను నమ్మి మోసపోవద్దు
. . . ఏఎస్ఐ నర్సింగ్ రావు రాజంపేట, బతుకమ్మ : ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా వేదికలను జాగ్రత్తగా వినియోగించాలని, అపరిచితులను నమ్మి మోసపోవద్దని ఏఎస్ఐ నర్సింగరావు సూచించారు. రాజంపేట కస్తూరిబా బాలికల విద్యాలయంలో సోమవారం ప్రేమలు - మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలు, మైనర్లపై జరుగుతున్న నేరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర సామాజిక అంశాలపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం. రాజేష్...